టీచర్ల నిర్లక్ష్యం.. క్లాస్‌ రూమ్‌లో పాము కరిచి బాలిక మృతి

వయనాడ్‌ : తరగతి గదిలో పాము కాటుకు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు వదిలిన ఘటన కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వయనాడ్‌ జిల్లాకు చెందిన ఎస్‌ షెహాలా(10), సుల్తాన్ బాథరీ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన షెహాలా.. తరగతి గదిలో ఉన్న రంధ్రంలో కాలు పెట్టగా.. పాము కాటేసింది. కాలుపై ఉన్నరక్తపు మరకలు గమనించిన తరగతి టీచర్‌.. రాయి తగిలిందని చెప్పి బ్యాండేజ్‌ వేసి క్లాస్‌లోనే కూర్చోపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బాలిక కళ్లు మూసుకుపోవడంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు.